శ్రీశైలే మల్లికార్జునమ్
2. శ్రీశైలే మల్లికార్జునమ్...... భట్టిప్రోలు విజయలక్ష్మి ఇప్పుడు ఆ శ్లోకంలోని రెండో క్షేత్రాన్ని చూద్దాం. అదే శ్రీశైలంలోని మల్లికార్జునుడు. ఈ క్షేత్రం మన తెలుగు రాష్ట్రాలలోనే వుంది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో వుంది. చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశం అది. స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ పుష్కలం. మనసుకు ప్రశాంతతని ఇచ్చే క్షేత్రం. ఆది శంకరులు ఈ క్షేత్రం గురించి ఈ విధంగా చెప్పారు. శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రి శృంగేఽపి సదా వసంతమ్ | తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ || ఈ శ్లోకార్ధం ఏమిటంటే, శ్రీశైలమనే శిఖరం మీద వివిధ దేవీ దేవతలతో కలిసి ఉంటూ, ఆ కొండ ప్రాంతానికంతా నిత్య వసంతాన్ని కలగచేస్తూ, మల్లిక, అర్జున వ...