గోకర్ణం-కుక్కి
గోకర్ణం-కుక్కి భట్టిప్రోలు విజయలక్ష్మి గోవా రాష్ట్రంలో పణజికి కొద్ధిగా ముందు మంగేష్ సంస్థాన్ ఉంది. ఇక్కడ ఆలయంలో దేవుడు మంగేష్, ఈశ్వరుడు. ఈ మంగేష్ లింగం ఇక్కడకు తీసుకుని రాకముందు ముర్మగోవాలోని కుశస్థలిలో అనే ప్రాంతంలో ఉండేది. ఆ రోజుల్లో అప్పటి పోర్చుగీసుల పాలనలో అనేక హిందూ ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, కొల్లగొట్టబడ్డాయి. ఆ సమయంలో ఆ క్రిస్టియన్ దాడులకు, మతాంతరీకరణలకు భయబడి, అప్పటి పూజారులైన గౌడ సారస్వత బ్రాహ్మణులు ఈ మంగేష్ లింగాన్...