పోస్ట్‌లు

మార్చి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

మా ఇంట్లో బామ్మ మడీ తడీ

మా ఇంట్లో బామ్మ మడీ  తడీ     భట్టిప్రోలు విజయలక్ష్మి                               నా చిన్నప్పుడు మా బామ్మ మాఇంట్లొనే ఉండేది. బామ్మ ఉంటే మా ఇంట్లో వంట తప్పనిసరిగా మడి కట్టుకునే చెయ్యాలి. బామ్మ మైల వంట తినేది కాదు. ఈ రోజుల్లో చాలా మందికి మడి అంటేనే తెలియదు. అందుకని వాళ్ళకోసం ముందుగా మడి అంటే ఏమిటో చెప్తాను. ముందురోజు తడిబట్టలు కట్టుకుని మరో జత తడి బట్టలు ఆరేసుకునే వాళ్ళు. ఆ ఆరేసిన బట్టలను మళ్ళీ ఎవరూ ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అవి మైల పడిపోతాయి. అలా ఎవరూ ఆ బట్టలు ముట్టుకునే వీలు లేకుండా వంట ఇంట్లో పైన ఒక వెదురుబొంగుని దండెంగా కట్టేవాళ్ళు. ఇంకో వెదురు బొంగు సాయంతో ఆ బట్టలను ఆరేయటం, మళ్ళీ వాటిని అవసరమైయ్యేటప్పుడు ఆ బొంగు సాయంతోనే తీసుకోవటం ఓ ఆర్ట్. ఈ మధ్య తిరుమలలో అర్చక భవన్ కి వెళ్ళినప్పుడు వరుసగా  ఓ 10, 15 దండేల నిండుగా మడి పంచెలు ఆరేయటం చూసి నాకు మళ్ళీ మా చిన్నతనం, మా బామ్మ మడి గుర్తొచ్చాయి.                      ...