పోస్ట్‌లు

మే, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పాపం......బామ్మ

పాపం......బామ్మ   భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                                                                              బామ్మకి మొత్తం 13 మంది సంతానం పెద్ద పెదనాన్నతో కలిపి. ఆయన్నెప్పుడూ సవతి కొడుకని వేరుగా చూసింది లేదు. తొలి చూలు సంతానం బాలాత్రిపురసుందరి పుట్టిన కొద్ది రోజులకే పోయిందిట. కానీ బామ్మ ఎప్పుడూ ఈ విషయాన్ని నాకు చెప్పనూ లేదు. తానూ ఆ విషయాన్ని తలచుకుని బాధపడుతుంటే నేను ఏనాడూ చూడనూ లేదు. అసలు మా కుటుంబంలో ఇటువంటి ఒక కారెక్టర్ ఉందని నాకు ఈ మధ్యనే, మా పెద్ద పెదనాన్న రాసిన వంశవృక్షం కాపీలో కనపడింది. తరువాత ఇందిరక్క ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే, ఆ బాలాత్రిపురసుందరి పేరే మా ఉమా పెదనాన్న వాళ్ళ చిన్న ...

బామ్మ - పెళ్ళి కథా కమామీషూ

 బామ్మ - పెళ్ళి కథా కమామీషూ భట్టిప్రోలు విజయలక్ష్మి                                                            ఎప్పుడూ బామ్మని ఒకటి అడిగేదాన్ని. ' బామ్మా, నీ పెళ్లి ఎలా అయ్యిందీ అని. "మా  నాన్నకి నేనంటే ప్రాణం, అందుకని నన్ను ఊళ్ళోనే ఇవ్వాలని మీ తాతగారికి ఇచ్చాడు" అనేది. 'మరి మీ అక్కని బైట వూరికి ఇచ్చారుగా' అంటే, 'అందుకే నన్ను ఊళ్ళోనే ఇచ్చాడు' అని చెప్పేది. 'ఇంత బంగారం, ఇంత ఆస్తి ఇచ్చి మరీ నిన్ను రెండో పెళ్ళివాడికి ఎందుకు ఇచ్చారు, పైగా అప్పటికే ఒక కొడుకు కూడా వున్నాడు గదా' నేనూ వదిలిపెట్టేదాన్ని కాదు. ఎందుకంటే, నాకెప్పటికీ ఒక ఆశ్చర్యం, అర్ధం కాని విషయం ఇది. ట్రంకు పెట్టెడు బంగారం ఇచ్చి, పైగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి, వ్యవసాయం చేసుకోవడానికి కొంత పొలం ఇచ్చి,  రెండో పెళ్లి వ్యక్తికి, అందునా ఓ ఆరేళ్ళ కొడుకున్న తండ్రికి ఇచ్చి బామ్మకు  ఎందుకు పెళ్లి చేశారూ...... అని.  ఆ వయసులో...

బామ్మా - బంగారం

బామ్మా - బంగారం    భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                                                                                                            అమ్మ బంగారం షాపు నుంచి రెండు సన్నని ముత్యాల గొలుసులు తెచ్చి, నాన్నకీ, బామ్మకీ చూపించి, నాకూ భారతికీ మెడల్లో వేసింది. మా అమ్మ కళ్ళు మెరిసిపోయాయి. 'ఎంత బాగున్నాయో, గొలుసులు, నాజూగ్గా, ముత్యాలు మెరుస్తున్నాయి కూడానూ' అంది అమ్మ. మా అమ్మకి ముత్యాలంటే ఇష్టం. 'అదేమిటి బంగారం గొలుసులు చేయించలేదా,' అని బామ్మ అడిగింది. ముత్యాల్లో బంగారమేనండీ, ఇద్దరికీ కలిపి కాసులో అయిపోయింది. అదే, మొత్తం బంగారం అంటే, చెరో మూ...

బామ్మా - ఉల్లిపాయలూ

బామ్మా - ఉల్లిపాయలూ  భట్టిప్రోలు విజయలక్ష్మి                                                           బామ్మకి ఉల్లిపాయలు పడవు. ఆచారానికి పనికిరావు అనేది. ఇవన్నీ శరీరంలో మొద్దుతనాన్ని తెస్తాయి. చురుకుగా ఉండరు అవి తింటే, అనేది. పైగా ఆ ఘాటు వాసన అంటేనే ఆవిడకి చికాకు. బామ్మ ఇంట్లో ఉంటే మా ఇంట్లోకి ఉల్లిపాయలు వచ్చేవి కాదు. చుట్టుపక్కల వాళ్ళు వండుకున్నా, ఆ వాసన పట్టేసి, చికాకు పడి తిట్టుకునేది. వీలైతే, వాళ్ళతో చనువుంటే, వెళ్లి మరీ, 'తప్పండీ, ఇలాంటి వంటలు తినకూడదు. ఇవన్నీ ఉద్రేకాన్ని పెంచుతాయి. పిల్లలు బండగా అయిపోతారని' చెప్పి వచ్చేది. 'ఎందుకు బామ్మా, నీకు ఉల్లిపాయలంటే కోపం' అని అడిగితే,' మనది నిత్యాగ్నిహోత్రం ఉండే ఇల్లు. ఇలాంటివి ఆచారానికి పనికిరావు' అనేది. 'ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం లేదు కదా బామ్మా', అంటే, 'ఒకప్పుడు ఉండేది కదా, మనం భూమి కింద పండినవి తినకూడదు', అనేది. మరి బంగాళాదుంపలు, కంద, పెండలం, చేమదుంపలూ కూడా భూ...