పోస్ట్‌లు

జులై, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్మమ్మా, తాతయ్యా

అమ్మమ్మా, తాతయ్యా భట్టిప్రోలు విజయలక్ష్మి                                                       మా అమ్మమ్మ, లక్ష్మీనరసమ్మ, చాలా అందంగా వుండేది. తెల్లగా, పొట్టిగా, నాజుగ్గా వుండేది. గొంతు బావుండేది. పాట అయితే నేనెప్పుడూ వినలేదు. చాలా నిదానంగా నెమ్మదిగా కనిపించేది. గట్టిగా మాట వినిపించేది కాదు. కానీ చురుక్కుమనిపించేది. మనిషి చాలా శుభ్రంగా వుండేది. పది మంది పిల్లల తల్లిలాగా కనిపించేది కాదు. ఇంతమంది కానీ, పెంచి, గొప్ప వాళ్ళను చేసింది ఈవిడేనా అనిపించేది. మా తాతయ్యా వాళ్ళ అన్నగారు డాక్టరు, ఆయన చాలా చిన్నతనంలోనే పోయారట. ఆయన మధ్యలో అడ్డం వుండి ఇప్పించిన అప్పులు తీర్చటానికి ఆస్తిలో పెద్దభాగం వదిలేసుకోవాల్సి వచ్చిందట. అందుకని మా అమ్మమ్మకి మా తాతయ్య మీదా, వాళ్ళ మామగారి మీదా కోపంగా ఉండేదిట. ఇంతమంది పిల్లలని ఎలా పెంచాలా అని బాధపడేదిట. అందరి చదువులు, పెళ్ళిళ్ళు ఎలా అని ఆలోచించేదిట. అయినా మా మామయ్యలందరూ, మల్లు మామయ్య తప్ప, రోహిణీ పిన్నీ గ్రాడ్య...

నండూరి కుటుంబం

నండూరి కుటుంబం భట్టిప్రోలు విజయలక్ష్మి                                               ఐదుగురి తరవాత మా అమ్మ, లీల. అమ్మ తరవాత పార్ధు మామయ్య. పార్ధు మామయ్య, సువర్చల అత్తయ్య (ఈ అత్తయ్య పేరు కూడా సువర్చలే) వాళ్ళు మాకందరికీ యెంత అలవాటంటే, మా ఇల్లు తరవాత అది మాకింకో ఇల్లన్నమాట. ఒక్కడే కొడుకు మధు సారధి. మధు పేరుకి మామయ్య కొడుకే గానీ మాకందరికీ ఇంకో తమ్ముడే వాడు. మమ్మల్నందరినీ అక్కా అనే పిలుస్తాడు. నన్ను పెద్దక్కా అంటాడు. వీళ్లిల్లు కూడా షరా మామూలే, సంగీత నిలయం, సాహిత్య నిలయం. ఈ మామయ్యక్కూడా పరిచయం ఏమీ అక్కర్లేదు. నండూరి పార్థసారథి, పేరు చాలు. గొప్ప రచయిత. ఈమామయ్య రాసిన పుస్తకాలు, వ్యాసాలూ చూస్తే ఈయనకి ఎన్ని విషయాల్లో, ఎన్ని రంగాల్లో ప్రవేశం, పట్టూ వున్నాయో అని ఆశ్చర్యం కలుగుతుంది. నంపాసాగా కూడా ప్రసిద్ధుడు. వాళ్ళ ఇంటి పేరు శ్రుతి. మామయ్య ఎన్ని పుస్తకాలు, ఎన్ని విభిన్నమైన కాన్సెప్ట్స్ తో, ఎంత విస్పష్టంగా రాసాడో అవి చదివితే తెలుస్తుంది. ఒక అల్ ఇ...

నండూరి కుటుంబం

నండూరి కుటుంబం భట్టిప్రోలు విజయలక్ష్మి                                            అమ్మా వాళ్ళు మొత్తం పది మంది సంతానం అమ్మమ్మా, తాతయ్యలకి. అందరికంటే పెద్ద నరసింహారావు మామయ్య, మేము పెద్ద మామయ్యా అనే వాళ్ళం. ఆ అత్తయ్య గురించైతే అస్సలు గుర్తే లెదు. ఆ మామయ్యకి అందరూ ఆడపిల్లలే, అందరూ చాలా ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నవాళ్ళే. వాళ్ళ పేర్లు కూడా ఐదుగురికి నిర్మల అని పెట్టారు. గిరిజా నిర్మల, సరోజా నిర్మల, పద్మజా నిర్మల, మధు నిర్మల, నిర్మలా దేవి, విజయ సుమిత్ర, అలమేలు మంగ, ఇవీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు. ఎందుకో ఈ కుటుంబం వాళ్ళు అందరితో కలవటం తక్కువ. వాళ్ళల్లో మంచి రచయిత్రులు, డాన్సర్లు, గాయకులూ, నటులు వున్నారు.                                రెండో మామయ్యే, నండూరి రామమోహనరావు గారు, పరిచయం అక్కర్లేని మనిషి. ఆయన ఎన్నో భావకవితలు, విశ్లేషణాత్మక వ్యాసాలూ, వివరణాత్మక రచనలు, అద్భుతమైన సంపాదకీయాలు, మరెన్నో అనువాదాలు రచిం...

మా అమ్మవే మరి కొన్ని ముచ్చట్లు

                                           మా అమ్మవే మరి కొన్ని ముచ్చట్లు భట్టిప్రోలు విజయలక్ష్మి                                            చక్కగా సమానంగా పంచుతానని పూలమాల కూడా మా అమ్మ గుర్తుల్లో చిన్నప్పుడు వడ్లుదంపించటం, కూలీలకి కూలీ ఇవ్వటం, అది వాళ్ళు చక్కగా పంచుకోవటం కూడా ఒకటి. ఈ విషయం చాలాసార్లు చెప్పేది. వడ్లపురుల్లోంచి వడ్లు తీసి ఆడ కూలీలని పిలిచి ఇంట్లోనే దంపించేవారట. రోళ్ళు, కుందులు, రోకళ్ళు తీసుకుని అందరూ ఆటలు, మాటలు, పాటలతో ఇల్లంతా హోరెత్తిస్తూ వడ్లు దంచేవారట. అమ్మా వాళ్ళంతా ఇదంతా నోరు తెరుచుకు చూస్తూ వుండేవాళ్ళట. ఆ కూలీలకు కూలీగా వడ్లు, బియ్యం, నూకలు ఇచ్చేవారట. వాళ్ళు అవన్నీ ఎంత సమానంగా పంచుకునేవారో చూస్తే ముచ్చట వేసేదిట. ఒక్క గింజ ఎక్కువా, తక్కువా కాకుండా భలే పంచుకునేవారట. ముందర మానికలతో, తరువాత చిన్న గిద్ద కొలతలతో, ఆ తరువాత అరచేతులతో, ఆ తరువ...

'అ' ---- అమ్మ, 'ఆ' ----- ఆరుగొలను

'అ' ---- అమ్మ, 'ఆ' ----- ఆరుగొలను భట్టిప్రోలు విజయలక్ష్మి                                                     మా బామ్మ చేత 'అందరి కోడళ్లలో లీల మంచిది, నేను దాని దగ్గర ఉంటా,  బాగా చూస్తుంది' అనిపించుకుంది. మా బామ్మ తన పూజా పంచాయతనం కూడా మా అమ్మకే ఇచ్చేసింది. అది నాన్న పోయాక అమ్మ బాబు, మా తమ్ముడు వివేకానంద్, దగ్గరికి వెళ్ళే ముందు మా పెద్ద పెదనాన్న పెద్ద కోడలు సత్యవతి వదినకి ఇచ్చింది. 'తరువాత తరంలో నువ్వే పెద్ద కోడలివి, పూజా, పునస్కారం వున్నదానివి' అంటూ.                                                   నాకు తెలిసి అమ్మ ఎప్పుడూ సన్నగా, నాజూగ్గానే వుండేది. లీల లావు అవటం అంటే ప్రపంచ వింత అన్నట్లుండేది. కానీ చాలా శక్తి వున్నట్లు అన్ని పనులూ చేసేది. సెకండ్ హ్యాండ్ మెరిట్ సూయింగ్ మిషన్ కొని మా అందరికీ దానితో బట్టలు కుట్టేది. తరవాత్తరవ...

మా అమ్మా వాళ్ళ తాతయ్య

మా అమ్మా వాళ్ళ తాతయ్య  భట్టిప్రోలు విజయలక్ష్మి                                            వాళ్ళ తాతయ్య గురించి చాలా సంతోషంగా బోల్డు ముచ్చట్లు చెప్పేది. ఆయన రోజూ దొడ్లో వున్నా బాదం చెట్టు ఆకులు కర్రతో దులిపి, ఆ ఆకుల్తో ఇంట్లో అందరికీ విస్తళ్ళు కుట్టి ఇచ్చేవాట్ట. ఒక్కోసారి ఏదైనా పండుటాకు, ఎర్రది రాలితే దానితో విస్తరికి ఓ చెవిలాగా ఎక్స్టెన్షన్ గా కుట్టేవాట్ట. అందరూ ఆ విస్తరి మాక్కావాలంటే మాకని పోట్లాడుకునేవారట. కానీ ఆ పోట్లాటలో ఎప్పుడూ మల్లు మామయ్యే నెగ్గేవాట్ట. వాళ్ళ తాతయ్యే చివరికి 'మల్లుకిచ్చేద్దాంలే' అనేవాట్ట.                                          అందరూ పొద్దున్నే చద్దన్నాలు ఊరగాయ వేసుకుని తింటుంటే మల్లు మామయ్య మాత్రం స్పెషల్ గా  రెండు బంగాళ  దుంపలు ఎర్రగా వేయింపించుకుని అందర్నీ ఊరిస్తూ తినేవాట్ట. అమ్మకి అన్నీ గుర్తే, ఆ విశేషాలన్నీ చెపుతూ వుండేది....

మా అమ్మ

మా అమ్మ  భట్టిప్రోలు విజయలక్ష్మి                           చాలా రోజుల తర్వాత ఏదో రాద్దామని కూర్చున్నా .  ఇది రాయటానికి అమ్మ   తరఫున   నండూరి వారి   విశేషాలు  రాయాల్సిన అవసరం పడటం కూడా   ఒక   కారణం .  హరి   అడిగినందువల్లా ,  పార్థు మామయ్యతో  మాట్లాడిన తర్వాతా ,  ఎన్నాళ్ళ నుంచో   నా వెంట పడుతున్న   మా   కాత్యాయనీ  మేడమ్ వ ల్లా , సావిత్రీ  ఆంటీ పుస్తకం చూసాకా , శ్రీదేవి పిన్ని పుస్తకం చదివాకా , నాకే ఇక రాయక తప్పదూ  అనిపించీ , మొదలు పెడుతున్న నా జ్ఞాపకాల దొంతర .                                                          ముందుగా మా అమ్మ గురించి, ఎందుకంటే ఈ బ్లాగ్, ఈ రాత కి కారణం అమ్మ కాబట్టి.  అమ్మ, నందివాడ లీలా కుమారి, పెళ్లి కాక ముందు నండూరి లీలా కుమారి. కానీ ఆవిడక...