మా పెద్దత్తయ్య
మా పెద్దత్తయ్య భట్టిప్రోలు విజయలక్ష్మి ఆవిడ పేరు పెద్దత్తయ్యే. అమ్మన్న అని కూడా అనేవాళ్ళు. పేరు కనకదుర్గ అనుకున్నా కానీ పూర్తి పేరు కనక దుర్గాంబ అని నాకు ఆవిడ పోయిన తరువాతే తెలిసింది. ఆవిడ ఎప్పుడు ఏ వేళలో చూసినా లక్ష్మీదేవిలా ఉండేది. ఆ కళ చాలా కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. ఆ లక్ష్మీకళ ఆవిడకు భగవద్దత్తం. ఆవిడకు తగ్గట్టు మామయ్యగారు చక్కగా నారాయణమూర్తి కళతో వుండేవారు. వారి వారి పేర్లు ఏమైనా వారు మాత్రం మొత్తం కుటుంబానికి లక్ష్మీ నారాయణులు. ఇద్దరికీ ఇద్దరే. ఆ ఇల్లు ఒక అన్నపూర్ణాలయం, సరస్వతీ నిలయం. ఎంతమంది అక్కడ ఉండి చదువుకున్నారో, ఎంతమంది ఆ ఇంట్లో ఆవిడ చేత్తో భోజనం చేశారో లెక్కే లేదు. ఎన్ని జననాలు, నిష్క్రమణాలు చూసారో పెద్దత్తయ్య, పెద్దమామయ్య గార్లు. బంధు మిత్రుల్లో ఎవరు హైదరాబాద్ వచ్చినా వారింట్లోనే ...