కళాసరస్వతి తెనాలి
కళాసరస్వతి తెనాలి భట్టిప్రోలు విజయలక్ష్మి తెనాలి రోజులు మా అందరికీ కూడా చాలా ప్రత్యేకం. బహుశా ఆరోజుల్ని మాలో ఎవ్వరూ మర్చిపోలేదు, మర్చిపోలేరు. ఎందుకంటే అవన్నీ ఒకరకంగా మాకు ఫార్మేటివ్ యియర్స్. మాకంటూ ఒక సంస్కృతీ, సంప్రదాయం, అభిరుచులు, అభిప్రాయాలూ, భావాలూ ఏర్పడటం అక్కడే జరిగింది. మొదట్లో ఒక ఇంట్లో మేడమీద చిన్నవాటాలో వుండేవాళ్ళం. ఒక నెలలోనే ఆ ఇంటికి ఎదురుగా వున్న వీధిలో ఒక పెద్ద ఇంటికి మారాం. ఆ ఇల్లు సినిమా యాక్టర్ ముదిగొండ లింగమూర్తి గారిది. ఆయన మద్రాసులోనే ఉండటంతో ఆ ఇల్లు ఖాళీగా వుండేది. పెద్ద పెరడు వున్నట్టు గుర్తు. ఆ ఇంట్లో కూడా ఎక్కువ రోజులు లేము. ఒక సంవత్సరం లోపే అది కూడా ఖాళీ చేసేసి వేదాంతం కృష్ణ ప్రసాదు గారింటికి మారాం. ఆయన పక్కనే వున్న పల్లె, కుంచవరంకి ప్రెసిడెంట్. వాళ్లకి ఈ ఇల్లు ఫార్మ్ హౌస్ లాంటిది. అప్పుడప్పుడు వాళ్ళు కుటుంబంతో సహా, ఒక్కోసారి దగ్గర బంధువులతో ...