పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ

చిత్రం
    పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ  అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 480.  పాయసాన్నప్రియా ఈ నామంలో విశుద్ధి చక్రనిలయకు ఇష్టమైన పదార్ధం ఏమిటో చెప్పకుందాం.  పాయసాన్నప్రియా అనే నామం, అమ్మవారికి పాయసాన్నమంటే ఇష్టమని చెప్తున్నది.  పయః అంటే పాలు. పాలు, బియ్యం, బెల్లం వేసి వండిన పాయసాన్నమంటే కంఠకూపంలో  వున్న,  విశుద్ధి చక్రనిలయకు ఎంతో ఇష్టం. అమ్మను తృప్తి పరచటం భక్తులకు ఇష్టం.  అందరికీ అంతే కదా, గొంతులో నుంచి మధురమైన పాయసం  లోపలకు దిగుతుంటే హాయిగా అనిపించదూ. మన కంఠకూపంలో వున్న ఆ  విశుద్ధి చక్రనిలయకు కూడా పాయసాన్నమే ఇష్టం.    పాలు, బెల్లం వేసి వండిన తియ్యని పాయసాన్నాన్ని ప్రియంగా స్వీకరిస్తున్న,  ఆ  పాయసాన్నప్రియ  కు   వందనం.  ఓం శ్రీ   పాయసాన్నప్రియాయై   నమః    481.  త్వక్స్థా విశుద్ధి చక్రనిలయ తన నాలుగు చేతులలో ఒక దానిలో చర్మాన్ని ధరించి వున్నదని చెప్పుకున్నాం కదా. అదే ఈ నామానికి అర్ధం. త్వగింద్రియం అంటే చర్మము.  త్వక్ అంటే ...

98. విశుద్ధి చక్రనిలయా, ఆరక్తవర్ణా, త్రిలోచనా ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా

చిత్రం
   విశుద్ధి చక్రనిలయా, ఆరక్తవర్ణా, త్రిలోచనా  ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98 ॥ 475.  విశుద్ధిచక్రనిలయా విశుద్ధి చక్రనిలయా అంటే కంఠ కూపమందున్న విశుద్ధి చక్ర మధ్యములో ఉండునది అని అర్ధం.  ఈ రెండు శ్లోకములలో ఆ విశుద్ధి చక్రనిలయ గురించి వివరంగా చెప్పకుందాం.  కంఠ కూపంలో ఒక చక్రమున్నది. దానినే విశుద్ధి చక్రము అంటాం.  విశుద్ధిచక్రానిది  జనలోకం, ఆకాశతత్వం. నీలి రంగు. శబ్ద ప్రధానం.  ఆ చక్రమధ్యంలో ఒక  పద్మము వున్నది. ఆ పద్మమునకు పదహారు దళములు.  ఆ పద్మ మధ్యంలో ఉన్న కర్ణిక, తామర బొడ్డుపై, ఆసీనురాలై అమ్మ కూర్చుని వున్నది.  ఆ పరమేశ్వరీ శక్తియే  విశుద్ధిచక్రనిలయ. ఈ చక్రానికి  అధిదేవత  జీవుడు .  కంఠకూపమందున్న పద్మములో ఆసీనురాలై వున్న,  ఆ  విశుద్ధిచక్రనిలయ  కు   వందనం.  ఓం శ్రీ   విశుద్ధిచక్రనిలయాయై   నమః    476.  ఆరక్తవర్ణా ఆరక్తవర్ణా అంటే కొద్దిగా తెలుపు కలసిన ఎరుపు రంగు అని అర్ధం. అటువంటి వర్ణాన్ని  పాటలీ వర్ణము అంటారు. తెలుపు, ఎరుపు కలసిన పాటలీ...

97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోవస్థా వివర్జితా సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ

చిత్రం
   వజ్రేశ్వరీ, వామదేవీ, వయోవస్థా వివర్జితా  సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 468.  వజ్రేశ్వరీ  షష్టీ తిథి నిత్యాదేవి పేరు మహావజ్రేశ్వరి. జాలంధర పీఠాధిష్టాన దేవత వజ్రేశ్వరి.  మణిద్వీపములో వున్న శ్రీపురంలో అనేక రత్నమయ ప్రాకారాలున్నాయి.  వాటిల్లో పదకొండవది  వైడూర్యములచే నిర్మింపబడిన వైడూర్యమయ  ప్రాకారము.  పన్నెండవ ప్రాకారము పూర్తిగా వజ్రములతో నిర్మింపబడింది. వజ్రమయము.  ఈ రెండు ప్రాకారముల మధ్యా వజ్ర అనే నది వుంది. ఈ వజ్రను దాటటం ఒక సిద్ధి.  ఆంజనేయుడికి కల సిద్ధులలో వజ్రసిద్ధి కూడా ఒకటి.  ఆతని దేహమే ఒక  వజ్ర కవచం.  అందుకే ఆంజనేయుడికి వజ్రాంగ బలీ,   బజరంగ బలీ  అనే నామం వచ్చింది.  ఆ వజ్రానదిలో రాజహంసలు తిరుగాడుతూ ఉంటాయి.  వజ్రేశ్వరి ఆ వజ్రానదికి అధీశ్వరి.  ఆ నది ఒడ్డునే  వజ్రాభరణములను ధరించి వజ్రేశీ నామముతో  వున్న దేవియే వజ్రేశ్వరి.  ఈ దేవియే ఇంద్రునికి వ జ్రాయుధము ఇచ్చింది అని  బ్రహ్మాండపురాణంలో వున్నది.  నేటికీ హిమాచల్ ...

96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ

చిత్రం
   సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా  కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 459.  సుముఖీ  సుముఖీ అంటే అందమైన చక్కని ముఖము కలది అని అర్ధం.  సుముఖీ అంటే, ఆ ముఖం అందంగా ఉండాలి. తేజస్సుతో వెలగాలి.  కోటి సూర్యుల వర్ఛస్సుతో ప్రభలు వెదజల్లాలి.  మహారాజ్ఞి కనుక రాజసం  భాసించాలి.    జ్ఞాన ప్రకాశం ప్రస్ఫుటంగా  కనపడాలి. ప్రసన్నంగా ఉండాలి. కారుణ్యంతో నిండాలి.  ప్రజ్ఞతో మెరవాలి. ఆకర్షణీయంగా ఉండాలి.  అమ్మ కనుక మాతృత్వం ప్రతిఫలించాలి.  దైత్యదమనీ కనుక అసురులకు భయం కలిగించాలి. శిష్టులకు ధైర్యం కలిగించాలి.  నుదురు అష్టమి చంద్రుడిలా ఉండాలి. కన్నులు మీనాల వలె ఉండాలి.  కనుబొమ్మలు మన్మధ చాపంలా ఉండాలి. ఆ మధ్యలో కస్తూరీ తిలకం చక్కగా దిద్దబడి ఉండాలి.  చెవులకున్న తాటంకాలు సూర్యచంద్రుల్లా ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ ఉండాలి.  కురులు సువాసనతో పరిమళించాలి. నాసిక సంపెంగ వలె సూటిగా ఉండాలి.  చెక్కిళ్ళు దర్పణాలు వలె మెరుస్తూ ఉండాలి. పెదవులు దొండపండ్ల వలే ఎర్రగా ఉండాలి.  శుద్ధ జ్ఞాన విద్యను అ...

95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ

చిత్రం
   తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ  మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 452.  తేజోవతీ తేజోవతీ అంటే గొప్ప తేజస్సు కలది అని అర్ధం. లలితాపరమేశ్వరీ దేవి తేజస్సు చాలా గొప్పది.  సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ వుంటారు.  లలితాపరమేశ్వరి నుంచి తీసుకున్న తేజస్సుతో, పగటి పూట సూర్యుడు తన తేజో కిరణాలతో  ప్రపంచానికి కాంతులను ఇస్తే, చంద్రుడు రాత్రి పూట కాంతులు వెదజల్లుతాడు.  ఈ రెండూ కాని సంధ్యాసమయాల్లో అగ్ని ద్వారా అమ్మవారి తేజస్సు ప్రకాశిస్తుంది.  అమ్మ మాత్రం ఎల్లవేళలా తన తేజస్సుని ప్రసరిస్తూనే ఉంటుంది.  శ్రీచక్రం లోని ప్రతి కోణమూ, ప్రతి కొనా, ఒక్కో తేజో కిరణానికి ఉద్గమస్థానం.  ఇంత తేజస్సు కలిగిన అమ్మను ఈ నామంలో తేజోవతీ అంటున్నాం.  సూర్య, చంద్ర,  అ గ్నుల ద్వారా తన తేజస్సుతో మనలను పోషిస్తున్న,  ఆ  తేజోవతి కి   వందనం.  ఓం శ్రీ   తేజోవత్యై   నమః    453.  త్రినయనా  త్రినయనా అంటే మూడు కన్నులు కల తల్లి అని అర్ధం, ఫాలనేత్రం కూడా కల పరమ...