నందివాడ ఆనందరామయ్యగారి వంశవృక్షం భట్టిప్రోలు విజయలక్ష్మి మా తాతయ్యగారిపేరు, ఆనందరామయ్య అనే ఆనందరామశాస్త్రి అని మా పెద్ద పెదనాన్న తన స్వహస్తాలతో రాసుకున్న వంశవృక్షం కాపీ లో నేను చూసాను. ఆ రాతప్రతిలో నందివాడ వంశ మూలపురుషుడు నందివాడ వెంకయ్య గారు అని రాశారు. అప్పటినుంచీ మా తాతగారిది ఏడవ తరం. నేను ఆ పై తరాల వారందరినీ వదిలేసి, కేవలం మా తాతగారి తరం నుంచీ మొదలుపెట్టి, ఒక నాలుగు తరాల వివరాలు మాత్రమే రాయాలని నన్ను నేను నియంత్రించుకున్నా. నాకు నేను ఒక పరిమితిని పెట్టుకున్నది ఎందుకంటే, వివరాలు సేకరించటం కష్టమైపోయింది. అలా అని ఏమీ చేయకుండా, లేదా వివరాల సేకరణలోనే ఎక్కువ కాలం గడిపేస్తే, ఇక రాయటం ఎప్పుడు? అందుకే నాకై నేను మాపిల్లల తరం వరకు మాత్రమే అనే నిబంధనను పెట్టుకున్నా. కానీ మా ఒక్క మా కుటుంబం గురించి మాత్రం సంపూర్తిగా రాస్తాను. అది ...
పోస్ట్‌లు
సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది
ప్రయాణోపనిషత్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ప్రయాణోపనిషత్ భట్టిప్రోలు విజయలక్ష్మి ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం , ఆయుఃకామార్థసిద్ధయే మునుముందుగా నా మనసులోని మాటలు, అసలు ఇలా యాత్రలు ఎందుకు చేయాలనిపించిందో, ఎలా చేసామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఏమేమి చూసామో, మాఅనుభవాలు, అనుభూతులు, అన్నీ అందరికీ చెప్పాలనిపించి, కొంచం సాహసం చేసి ఈ రచనా కార్యక్రమం మొదలుపెట్టాను. కాకుంటే, 2012 అక్టోబర్ ముందు చేసిన ప్రయాణాలన్నీ మాకూ, పిల్లలకూ సెలవులు దొరికినప్పుడు సాగేవి. బొకారోలో వుంటున్నప్పుడు అక్కడినుంచి కూడా చాలా ప్రదేశాలు చూశాం. అంతేకాదు, ఏ వూరు ట్రాన్స్ ఫర్ అయినా ఆ చుట్టుపక్కల ఏమేమి చూడచ్చు అని ఆలోచించేవాళ్ళం. వీలైనంతవరకు చ...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వంశ వృక్షం అంటే ఏమిటి భట్టిప్రోలు విజయలక్ష్మి ఎలిక్స్ హాలీ నవల రూట్స్ చదివినప్పటినుంచీ నాకు కూడా ఎంతో కొంత మన పూర్వీకుల గురించీ, గోత్ర, ప్రవర గురించీ తెలుసుకోవాలని చాలా అనిపించింది. మా యాత్రల్లో భాగంగా, మా రూట్స్ వున్న నందివాడ, నండూరు, ఆరుగొలను, పొన్నూరు, భట్టిప్రోలు వంటి ఊళ్ళు ప్రత్యేకంగా చూసి వచ్చాం. ఆ సందర్భంగా కొన్ని వివరాలుకూడా సేకరించాను. అవి అన్నీ కలిసి ఇప్పుడు ఈ రూపంలో బయటకు వస్తున్నాయి. వంశ వృక్షం రాసేముందు కొంచం మన వంశం వివరాలు, అసలు ఈ కాన్సెప్ట్ ఏమిటో చెప్పుకుందాం. ఇంటిపేరు నందివాడ. ఉండేది ఆరుగొలను. ఇంటిపేరు...