పోస్ట్‌లు

డిసెంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పశుపతినాథ్---ఖాట్మండు

చిత్రం
పశుపతినాథ్---ఖాట్మండు భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                               నేపాల్  మేము రెండు సార్లు చూసాం. 1993 లో ఒకసారి, 2018 లో ఒకసారి. 1993 లో వెళ్ళినప్పుడు మాతో మా పిల్లలు, మా అమ్మానాన్నా, మా పెద్ద చెల్లెలు, మరిది, వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. మొత్తం పదిమంది. మా అమ్మకి బుద్ధుడంటే చాలా ఇష్టం. లుంబిని చూడాలని అడిగింది. అప్పుడు మేము బొకారోలో ఉండేవాళ్ళం. అందరం గోరఖ్ పూర్ లో కలుసుకున్నాం. అక్కడ గోరక్షానాథుడి మందిరానికి వెళ్లాం. మానాన్న మమ్మల్నందరినీ గీతాప్రెస్ కి కూడా తీసుకెళ్లాడు. ఆ తరువాత అందరం లుంబిని వెళ్లి అక్కడ బుద్ధుడు జన్మించిన స్థలం చూసాం. మాయాదేవి ఒక తటాకం ఒడ్డున చెట్టు కొమ్మని పుచ్చుకుని నుంచుని బుద్ధుడిని కంటుంది. ఆ దృశ్యం అక్కడి శిల్పాల ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు ఆ తటాకం అంతా ఎండిపోయి వుంది. అక్కడ గైడ్ 'ఆరోజుల...

త్రికోణేశ్వరం --- ట్రింకోమలై

చిత్రం
త్రికోణేశ్వరం --- ట్రింకోమలై     భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                                                                                                                                                                    శ్రీలంక యాత్ర చేయాలని ఎన్నాళ్ళనుంచో కోరిక. పైగా ఆ యాత్ర కూడా షిప్ లో చెయ్యాలని. ఎందుకంటే, సుమారు ఈ పదేళ్లనుంచీ అన్ని రకాల వాహనాలూ ఎక్కాం ఒక్క క్రూయిజ్ తప్ప. అందుకని ఎట్లాగయినా ఈ యాత్ర...

అమరనాథ్ దర్శనం

చిత్రం
అమరనాథ్   దర్శనం  భట్టిప్రోలు విజయలక్ష్మి                                                         మేము చేసిన అన్ని యాత్రల్లోకీ కఠినమైనదీ,  ప్రమాదభరితమైనదీ ఈ అమరనాథ్ యాత్ర, దీని తరువాత ఆ జాబితాలో యమునోత్రి వస్తుంది. మిగిలిన అన్ని యాత్రలు దాదాపు కొద్దో, గొప్పో ఒకలాంటివే, అంత ప్రమాదమైనవి కావు. దానికి తోడు, ఈ అమరనాథ్ యాత్రకు నియమ నిబంధనలూ ఎక్కువే. మా అమరనాథ్ యాత్ర మాత్రం చాలా తమాషాగా, అనూహ్యంగా జరిగింది. మే, జూన్ 2014 లో గుజరాత్,  మధ్యప్రదేశ్ లలోని అన్ని దర్శనీయ క్షేత్రాలు దాదాపు మూడు వారాలపాటు దర్శించుకుని ఇంటికి వచ్చాం. మా పెద్దబ్బాయి మమ్మల్ని చూసి ఇన్నాళ్లు అదీ మాంఛి ఎండల్లో గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలు తిరిగి వచ్చినా శుభ్రంగా ఫిట్ గా వున్నారు. ఈ వారమే అమరనాథ్ యాత్ర కూడా అనౌన్స్ చేశారు, అక్కడికి కూడా వెళ్ళచ్చు గదా అన్నాడు. అసలు మాకు అప్పటిదాకా మాకు వెంటనే మరో యాత్ర గురించిన ఆలోచన లేదు. నేనింకా అప్...

ఆదిశంకరుడు-కాలడి నుంచి కేదార్ వరకు

చిత్రం
ఆదిశంకరుడు- కాలడి నుంచి కేదార్ వరకు భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                                                                                     శ్రీ శంకర భగవత్పాదులు పుట్టేనాటికే దేశంలో మతకలహాలు విపరీతంగా ఉండేవి. ఎన్నో మతాలూ, ఎందరో గురువులు, ఎన్నెన్నో మార్గాలు. జనం వీటన్నింటితో విసిగిపోయి వున్నారు. మన భారతీయులందరూ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సనాతనులే. అది మన ధర్మం, ధార. హిందూ అనే పదం ఆరోజుల్లో లేదు. ఆంగ్లేయులొచ్చిన తరువాత ఈ పదం మన హిందువులకు దాదాపు పర్యాయపదమై పోయింది. మతం అంటే, ఒక గురువు, ఆ గురువు ఆలోచనాధార, ఆ పంథాను అనుసరించే శిష్యులు, అంతే. శంకరులనాటికి హిందూ శబ్దం లేదు. సింధునది మాత్రమే వుంది. మన ఉపఖండంలో వున్...

ఘృష్ణేశంచ శివాలయే

చిత్రం
12. ఘృష్ణేశంచ శివాలయే......  భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                                                                 ఈ క్షేత్రం జ్యోతిర్లింగక్షేత్రాలలో పన్నెండవది,  చివరిది. మహారాష్ట్ర రాష్ట్రంలో వేరుల్ లో వున్న ఆలయం ఇది. ఈ క్షేత్రానికి మేము రెండుసార్లు వెళ్లాం. ఈ ఆలయం బయట కొంతమంది ఆవుల్ని, దూడలని పెట్టుకుని గడ్డిమోపులను పెట్టుకుని కూర్చొని ఉంటారు. భక్తులు రాంగానే, అమ్మా, గైయ్యాకో ఘాస్ ఖిలావో, అంటూ వెంటపడతారు. ఇది కూడా బాగానే వుందే అనుకుని ఆ ఆవులకి, దూడలకి గడ్డి తినిపించి వాళ్లకు డబ్బులిచ్చి లోపలకు వెళ్లాం. గుడిని, గోపురాన్ని చూస్తూనే ఇది చాలా శక్తివంతమైన ఆలయం అని తెలిసిపోతూనే ఉంటుంది. పెద్ద ప్రాంగణం,  ఐదు అంతస్థుల  పెద్ద  గోపురం. చూడ్...