పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

కుంభకోణం

చిత్రం
కుంభకోణం  భట్టిప్రోలు విజయలక్ష్మి                                                     కుంభకోణం తమిళనాడులోని ఒక ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రం. ఇక్కడ లెక్కలేనన్ని దేవాలయాలు వున్నాయి. అసలు ఈ వూరే పుణ్యక్షేత్రాల నగరం. మొత్తం ఎన్ని దేవాలయాలున్నాయో చెప్పటం కూడా కష్టం. పైగా దాదాపు అన్నీ పురాతన ఆలయాలే. ఇక్కడ వున్న ఆది కుంభేశ్వరాలయంలో ఉన్న కుంభేశ్వరస్వామి పేరు మీదే ఈ ఊరును కుంభకోణం అని పిలుస్తున్నారు. ఇక్కడ వున్న అన్ని ఆలయాల గురించీ చెప్పటం కూడా అసాధ్యం. ఒకవేళ చెప్తే  అదే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. మనం కొన్ని శివాలయాలు గురించి మాత్రం ముచ్చటించుకుందాం.  సుమారు 20 కిమీ పరిధిలో  చోళరాజుల కాలంలోనే నిర్మించబడ్డ ఇతర దేవతల ఆలయాలు కాకుండా  కేవలం శివాలయాలే  37  వు న్నాయి. అన్నింటిలో ముఖ్యమైన ఆది కుంభేశ్వరాలయం గురించి ముందుగా చెప్పుకుందాం.                            ...

శ్రీకాళహస్తి-గుడిమల్లం

చిత్రం
  శ్రీకాళహస్తి - గుడిమల్లం  భట్టిప్రోలు విజయలక్ష్మి                                                     ఇప్పటివరకూ నాలుగు పంచ భూత ఆలయాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిగిలిన అయిదో పంచభూత క్షేత్రమైన శ్రీకాళహస్తి లోని వాయులింగాన్ని దర్శిద్దాం రండి. మేము ఈ ఆలయాన్ని కనీసం పది పదిహేను సార్లైనా చూసి ఉంటాం. తిరుపతికి వెళ్లిన ప్రతిసారీ కాకపోయినా కొన్నిసార్లైనా ఇక్కడికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వాయుదేవుడు కర్పూరంతో శివలింగాన్ని తయారు చేసి ఆ కర్పూర లింగానికి ఎంతో శ్రద్ధతో పూజలు చేసాడట. వాయుదేవుడి భక్తికి మెచ్చిన శివుడు ఆ ప్రాంతం లోనే వాయుదేవుడితో సహా లింగరూపంలో కొలువుంటానని వరం ఇచ్చాడట. ఇక్కడ వాయువు వున్నదనటానికి సాక్ష్యంగా ఈ శివుడు ఊపిరి పీలుస్తుండటం నిదర్శనంగా చెపుతారు. ఈ ఆలయంలో పైకప్పు నుంచి వేళ్ళాడుతున్న రెండు అఖండ దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. అందులో ఎడమవైపు పెట్టిన దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. అదే సమయంలో కుడివైపున పెట్టిన దీపం స్థిరంగా నిల్చి...

తిరువణ్ణామలై-అగ్నిలింగం

చిత్రం
తిరువణ్ణామలై-అగ్నిలింగం  భట్టిప్రోలు విజయలక్ష్మి                                          పంచభూత లింగాలలో ఇంతవరకు పృధ్వీలింగం, జలలింగం, ఆకాశలింగం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అగ్నిలింగం గురించి చెప్పుకుందాం. ఆ తరువాత వాయులింగం గురించి చెప్పుకుందాం. అన్నట్టు ఇక్కడ నేను ఇంతవరకూ చెప్పని మరో విషయం కూడా చెపుతాను. అది మన పంచేద్రియాలకూ, పంచభూతాలకూ గల సంబంధం. పంచభూతాలూ మన పంచేంద్రియాలతో ఎలా పని చేయిస్తున్నాయో చూడండి. ఆకాశం నుంచి శబ్దం ఉత్పన్నమవుతోంది, దాన్ని మనం చెవుల ద్వారా వినగలం. మధ్యలో వున్న స్పేస్, లేదా మీడియం ద్వారా మాత్రమే శబ్దం పయనిస్తుంది. అదే ఆకాశం. అంటే ఆకాశం మన శ్రవణేంద్రియం పనిచేసేలా చేస్తోంది. ఇక మనకు గాలితో స్పర్శ తెలుస్తోంది, అంతేకాక గాలి శబ్దాన్ని వినగలం కూడా. ఇక్కడ గాలి తన స్పర్శచేత త్వక్ (చర్మము) ఇంద్రియాన్ని, శ్రవణేంద్రియాన్ని పనిచేయిస్తోంది. ఆ తరువాత అగ్ని, ఈ అగ్నికి శబ్దం, స్పర్శ మాత్రమే కాక రూపం కూడా వుంది. మనకు హోమ గుండంలో ఎన్నెన్ని రూపాలు కనిపిస్తాయో ...

చిదంబరం-వైదీశ్వరం

చిత్రం
చిదంబరం-వైదీశ్వరం    భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                 చిదంబర క్షేత్రం పంచభూత శివ క్షేత్రాలలో మూడవది. ముందరే చెప్పా గదా, పంచభూతాలు, పృధ్విరాపస్తేజోరగ్నిర్వాయుః  అని. పృధ్వీతత్వంతో కంచిలో ఏకామ్రేశ్వరునిగా కరుణిస్తూ, ఆపస్తత్వంతో, అంటే జలతత్వంతో తిరువనైకోయిల్ లో జంబుకేశ్వరునిగా కనిపిస్తుంటే, ఇక్కడ చిదంబరంలో చిదంబరేశ్వరునిగా ఆకాశతత్వంతో కటాక్షిస్తున్నాడు ఆ మహాదేవుడు. ఆకాశతత్వం, అంటే తేజోతత్వం. ఆకాశంలో తేజస్సు, వెలుగు తప్ప ఏముంటుంది. మరో విషయం, మట్టినీ, నీటినీ, నిప్పునీ, తాకచ్చు, గాలి మనను తాకితే అనుభూతి చెందవచ్చు. కానీ ఆకాశం అంటే, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, యెంత ఎత్తులో ఉంటుంది, యెంత దూరంలో ఉంటుంది, యెంత మేర ఉంటుంది అన్న విషయం, పై నాలుగు చెప్పినంత స్పష్టంగా చెప్పలేము. ఆ తెలిసీ తెలియని, కనిపించీ కనిపించని, తత్వమే ఈ చిదంబర ఆకాశతత్వం. ఇక్కడ మనను దేవుడిని...