పరమాచార్యుల ప్రసన్నదృష్టి
పరమాచార్యుల ప్రసన్నదృష్టి భట్టిప్రోలు విజయలక్ష్మి స్వాములవార్లు వచ్చేరోజుకి ఒక రోజు ముందరే అందరం ఆరుగొలను చేరుకున్నాం. ఇటు నందివాడ కుటుంబం నుంచీ, అటు నండూరి కుటుంబం నుంచీ దాదాపు అందరూ వచ్చారు. స్వాములవారికి పూర్ణకుంభంతో స్వాగతం చెప్పారు అమ్మా, నాన్నా. స్వాములవారితో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చారు. బళ్ళూ, ఎడ్లూ, వాటిని నడిపే వాళ్ళూ, పల్లకీ, దాన్ని మోసే బోయీలూ, ఒక ఏనుగూ, దాని మావటీ వచ్చారు. వీళ్ళే కాక, వేదపండితులూ, పూజారులూ, సేవకులూ, వంట బ్రాహ్మణులూ, వీళ్లంతా కూడా వచ్చారు. ఇంతమందికీ నాన్నా వాళ్ళ ఇల్లే విడిది. దాన్నే మేము ఓ నెల క్రితం బాగు చేయించింది. సుమారు ఓ 50, 60 మంది అక్కడ దిగారు. స్వామివారు వస్తూనే పీఠం పెట్టారు. స్వాములవారికి ఊరు ఊరంతా బ్రహ్మరథం పట్టింది. పది రోజులు ఉన్నారు ఆరుగొలనులో పీఠంతో సహా స్వామీజీ. ఆ పది రోజులు ఊరంతా జాతరే ...