ఘృష్ణేశంచ శివాలయే
12. ఘృష్ణేశంచ శివాలయే......
భట్టిప్రోలు విజయలక్ష్మి
ఈ క్షేత్రం జ్యోతిర్లింగక్షేత్రాలలో పన్నెండవది, చివరిది. మహారాష్ట్ర రాష్ట్రంలో వేరుల్ లో వున్న ఆలయం ఇది. ఈ క్షేత్రానికి మేము రెండుసార్లు వెళ్లాం. ఈ ఆలయం బయట కొంతమంది ఆవుల్ని, దూడలని పెట్టుకుని గడ్డిమోపులను పెట్టుకుని కూర్చొని ఉంటారు. భక్తులు రాంగానే, అమ్మా, గైయ్యాకో ఘాస్ ఖిలావో, అంటూ వెంటపడతారు. ఇది కూడా బాగానే వుందే అనుకుని ఆ ఆవులకి, దూడలకి గడ్డి తినిపించి వాళ్లకు డబ్బులిచ్చి లోపలకు వెళ్లాం. గుడిని, గోపురాన్ని చూస్తూనే ఇది చాలా శక్తివంతమైన ఆలయం అని తెలిసిపోతూనే ఉంటుంది. పెద్ద ప్రాంగణం, ఐదు అంతస్థుల పెద్ద గోపురం. చూడ్డానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గోపురం మీద విష్ణువు దశావతారాల శిల్పాలుంటాయి. స్తంభాలమీద శివ తాండవ మూర్తులు ఉంటాయి. ఎవరు ఎలా భావించినా, మేమిద్దరం మాత్రం ఎప్పుడూ ఒక్కటే అని శిలాశాసనం రాసి పెట్టినట్టు.
ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రం గురించి శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. ఈ ప్రాంతానికి మొదట్లో ఇలాపురమనే పేరుండేదట, క్రమేణా వేరుల్, వేలూరు అని మారిందని అంటారు. ఈ ప్రాంతానికున్న ఇంకా అసలైన పాతపేరు శివాలయ్ అని. అందుకే ఘృష్ణేశంచ శివాలయే అంటారు. ఈ వివరాలన్నీ శివపురాణంలో వున్నాయి.
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||

వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||

ఈ ఆలయం ప్రాంగణం చాలా పెద్దది. పెద్ద పెద్ద చెట్లు, వాటి చుట్టూ రాతి తిన్నెలు చాలా బావుంటాయి. లోపల అభిషేకం చేసుకుని బయట ఆ చెట్టు తిన్నెలపై కూర్చుని గుళ్లో ఇచ్చ్చిన ప్రసాదం తింటూ కూర్చుంటే, హాయిగా ఉంటుంది. ఇక వేరే భవబంధాలేవీ గుర్తు రావు. బయట ఆవులు, లోపల చెట్లు ఆహ్లాదంగా ఉంటాయి. గుడి లోపల అందరూ లింగాన్ని స్పృశించి నమస్కరించుకోవచ్చు. కానైతే సంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం వుంది. పురుషులైతే పైభాగంలో ఏమీ ధరించకూడదు. ఆ నియమాలు పాటించేవారికే గర్భగృహ ప్రవేశం. లింగం పురాతనమైనది. శక్తి వెదచల్లుతూ ఉంటుంది. నిత్య పూజలు నియమానుసారంగా చేస్తూ వుంటారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అభిషేకం చేసుకున్నాము. ఒక పూర్ణఫలం, కొబ్బరికాయను నాకు ప్రసాదంగా ఇచ్చి ఇంటికి వెళ్లి కొట్టుకొమ్మన్నారు. శివుడికి నమస్కరించి సంతోషంగా దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను. ఇదీ మా ఘృష్ణేశ్వర యాత్ర కథ. ఈ ఆలయం వెబ్ సైట్ లింక్ ఇదీ. https://myoksha.com/grishneshwar-temple/
ఈనాటితో మనం మన ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం పూర్తి చేసుకున్నాం. ఇక నుంచీ మేము దర్శనం చేసుకున్న మరికొన్ని ప్రసిద్ధమైన, మహిమాన్వితమైన, ప్రత్యేకమైన శివాలయాల గురించి చెప్పుకుందాం. ఆ శక్తిని నాకు ఆ దేవదేవుడే ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
విశాలమైన, రమ్యమైన, మహోన్నతమైన ఇలాపురమనే నగరంలో వెలసిన, జగమంతటి చేతా కొలవబడే పరమ దయామయుడైన ఆ ఘృష్ణేశ్వరున్ని శరణు వేడుతున్నాను అని ఈ శ్లోకార్ధం. ఈ వూరికి గల ఎన్నో పేర్లలో శిఖర్ శింగనాపుర్ అనే పేరు కూడా వుంది. ఈ శివుడికి కుసుమేస్వర్, ఘృష్మేశ్వర్, ఘృష్ణేశ్వర్ అనే పేర్లు కూడా వున్నాయి. ఘృశ్మ అనే భక్తురాలు ప్రతి నిత్యం మట్టితో నూటొక్క శివలింగాలు చేసి, శివార్చన చేసి ఇక్కడి కొలనులో నిమజ్జనం చేస్తుండేది. ఆ కొలనుకే శివాలయ్ అని పేరు. పార్వతికి దాహం వేసినప్పుడు శివుడు తన త్రిశూలంతో పోతూ వేసి ఈ కొలను సృష్టించాడని, అందుకే దీని పేరు శివాలయ్ అని కాశీ ఖండంలో వుంది. గుడిలో ఆ కొలను నేటికీ కనిపిస్తుంది. ఘృశ్మకు కొడుకు పుట్టి పెద్దవాడయ్యాడు. పిల్లలు లేని ఆమె సవతి అది సహించలేక ఒకరోజు ఘృశ్మ కొడుకుని చంపి ఆ కొలనులో పడేస్తుంది. ఆ విషయం తెలిసి ఘృశ్మ ఎంతో బాధపడినా, శివ దీక్షకు భంగం కలగకూడదని ఎప్పటి వలెనే నూటొక్క శివలింగాలు చేసి, శివార్చన చేసి కొలనులో నిమజ్జనం చేస్తుంది. అప్పుడు శివుడు ఆమె భక్తితత్పరతకు మెచ్చి జ్యోతిర్లింగ రూపంలో ఆ కొలనులో ఉద్భవించి ఘృశ్మ కొడుకుని బతికించి ఆమెకు ఇచ్చాడు. అందుకు ఘృశ్మ ఎంతో సంతోషించి ఆ పరమ దయామయుడ్ని శతవిధాల కీర్తించి అక్కడే వుండి భక్తులను కటాక్షించమని కోరుతుంది. తధాస్తు అన్న శంకరుడు అక్కడే ఆ భక్తురాలి పేర ఘృష్మేశ్వర్, ఘృష్ణేశ్వర్ అనే పేర్లతో వెలిశాడని స్థలపురాణం.
భోంస్లే కుటుంబానికి చెందిన ఒక రాజుకు శివుడు కల్లో కనపడి అక్కడ వున్న ఒక పాము పుట్టలో అపారమైన నిధి ఉందనీ, ఆ నిధితో తనకు ఒక భవ్యమైన మందిరం కట్టించమనీ చెప్పాడు. నిజంగానే పుట్టను తవ్వితే నిధి దొరికింది. మరాఠీ లో పుట్టలను వేరుల్ అంటారనీ, అందుకే ఆ వూరికి ఆ పేరు వచ్చినదనీ అంటారు. తరువాతి కాలంలో మొఘల్ దండయాత్రలలో ఈ ఆలయం బాగా ధ్వంసం అయ్యింది. ఇండోర్ రాణి అహల్యాబాయి పరమ శివభక్తురాలు. ఆవిడ ఈ ఆలయాన్ని నిర్మించి తిరిగి పూర్వ శోభను మందిరానికి తెచ్చారు. అహల్యాబాయి నిర్మించిన ఎన్నో ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఆమె గురించి మాహేశ్వర్ ఆలయాల గురించి చెప్పినప్పుడు వివరంగా చెప్తాను.
ఈ ఆలయం గురించి మరో కథ కూడా ప్రచారంలో వుంది. శివపార్వతులు ఒకసారి చదరంగం ఆడుతుండగా ఆటలో శివుడు వోడి పార్వతి గెల్చిందట. అప్పుడు శివుడు అలిగి కైలాసం వదిలి సహ్యాద్రికి వచ్చాడట. అమ్మవారు కూడా అప్పుడు ఒక ఆటవిక వనిత రూపంలో శివుని వెంట వచ్చిందట. ఆసమయంలో అమ్మవారు పసుపు చేతిలో వేసుకుని కలుపుతుంటే అది ఒక లింగం వలే ఏర్పడిందట. ఘర్షణ వల్ల ఏర్పడిన లింగం కనుక ఘృష్ణేశ్వర్ అని పేరు వచ్చిందంటారు.
ఈ యాత్రలోనే అజంతా, ఎల్లోరా కూడా చూసాము. ఎల్లోరా లోని కైలాసనాథ దేవాలయం సృష్టి లోనే గొప్ప కట్టడం. ఏకరాతిలో తొలిచిన అంత పెద్ద కట్టడం ఆశ్చర్యంగా అద్భుతంగా అందంగా ఉంటుంది. ఒక రాతి గోడపై రామాయణగాధలు చెక్కితే మరొక గోడపై మహాభారతగాధలు చెక్కారు. శివుడు, నంది, ధ్వజస్తంభాలు, అన్నీ చాలా మనోహరంగా చెక్కారు. మొత్తం మందిరాన్ని మోస్తున్నాయా అన్నట్టు భారవాహక ఏనుగులను వరుసగా చెక్కారు. కింద నుంచి తొలచటం కుదరదు కనుక పైనుంచి కిందకు తొలుచుకుంటూ వచ్చారని గైడ్ చెప్పాడు. కొన్ని సంవత్సరాలపాటు సాగిన ఈ బృహత్కార్యంలో రాష్ట్రకూటులు, పల్లవులు, చాళుక్యులు కూడా వారి వారి సేవలందించారని తెలిసింది. అప్పుడనిపించింది, ఎంతో శ్రమతో, భక్తితో, ఖర్చుతో, నైపుణ్యంతో కొన్ని వందల వేలమంది నిర్మించిన కట్టడాలని, మతవిశ్వాసాలతో నిర్మించిన ఆలయాలని, శిల్పాలని, దురాశతో, యెంత నిర్దయగా వాటిని ధ్వంసం చేశారో కదా అని చాలా బాధ వేసింది. ఇది మన సంసృతి కాదు. మన సంస్కృతీ సాంప్రదాయాలు మనకు నేర్పింది వేరే. "ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, ఓం శాంతిః శాంతిః శాంతిః" అని ప్రార్ధించటం మన పద్ధతి. ఇదే మన సంస్కృతి. మన దేశ ఘన వారసత్వం అనిపించింది. ఓం నమః శివాయ అని నమస్కరించుకుందాం.
ఇక అజంతా గుహల విషయానికొస్తే, ఇవి కూడా రాతిలో తొలిచి నిర్మించినవే. బౌద్ధులు వారి విహారాల కోసం ఇటువంటి గుహలను కొండలపై ఎత్తుగా, అందరికీ దూరంగా వారి జప, తప, ధ్యానాదులకు భంగం కలగకుండా చూసుకుని నిర్మించుకునేవారు. ఈ గుహల్లో శిల్పాలే కాకుండా పెయింటింగ్స్ కూడా కనిపిస్తాయి. బుద్దుడి జాతకకథలను కూడా ఆ పెయింటింగ్స్ లో చూపారు. బుద్ధుడు ఆ చిత్రాల్లో యెంత కరుణగా శాంతంగా ఉంటాడో. గోడలపై, స్తంభాలపైనే కాకుండా ఆనాటి రంగులు ఈ నాటికీ పాడలేదు. వెజిటబుల్ రంగులు వాడారంటారు. లేపాక్షి లోనూ ఇదే విధంగా చిత్రాలున్నాయి. విజయనగర కాలంలో వేసినా ఆ రంగులు ఇప్పటికీ పాడవలేదు. ఆ వివరాలు లేపాక్షి గురించి రాసినప్పుడు చెప్తాను. ఈ అజంతా గుహలని కూడా కొన్ని సంవత్సరాల పాటు నిర్మించారు. వీటిల్లో బౌద్ధంలోని హీనయాన, మహాయాన ఛాయలు రెండూ కనపడతాయి. బౌద్ధ శిల్పాల్లో, చిత్రాల్లో ఒక రకమైన లాలిత్యం, అందం, వస్త్రాలపై మడతలు, వస్త్రం వెనుక శరీరం, దాని నాజూకుతనం ఇవ్వన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మనం మనవాళ్ళ కళను శ్రమను, నైపుణ్యాన్ని, ఎందుకో గుర్తించం. గుర్తించినా గౌరవించం. పెరటి చెట్టు మందుకు పనికిరాదని సామెత. మన కళాకారులు పనిని దైవసేవగా భావించి అంతా దేవుడికే సమర్పించుకున్నారు. మనం కూడా ఏ పూజ చేసినా చివర్లో ఆ పూజను ఆ దేవుడికే అర్పణమస్తు అని అర్పించేస్తాం కదా. కట్టించిన రాజులకైనా పేరొచ్చింది కానీ, కట్టిన శిల్పుల పేర్లయినా తెలియవు చాలాసార్లు. మైఖేల్ ఆంజెలో కన్నా మన వారు దేంట్లో తక్కువ. అతడు తన సంప్రదాయ కళను చూపిస్తే, మనవారు మన సంప్రదాయ కళను చూపిస్తున్నారు. మన భారతదేశంలో ఇలాంటివి కన్నులకింపైన ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు వున్నాయి. వెళ్ళండి, చూడండి, ఆనందించండి.
చివరిగా శంకర భగవత్పాదులు చెప్పిన ఫలశృతి గురించిన శ్లోకాలను చూద్దాం. లఘు స్తోత్రంలో చెప్పిన ఫలశృతి శ్లోకమిది.

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరఃసప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
ఈ శ్లోకార్ధం ఏమంటే, ఎవరైతే ఈ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని ఉదయం, సాయంత్రం పఠిస్తారో వారికి ఏడు జన్మల పాపం తలచుకోంగానే నశించిపోతుంది. ఇది శంకరుల మాట, పొల్లుపోదు. శంకర శంకర సాక్షాత్ కదా. ద్వాదశ జ్యోతిర్లింగ సంపూర్ణ స్తోత్రంలో కూడా చివరిలో ఫలశృతి చెప్పారు ఆది శంకరులు. ఆ ఫలశృతి శ్లోకం ఇదీ.
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||
ఈ శ్లోకార్ధం ఏమంటే, ఈ జ్యోతిర్మయమైన ద్వాదశ లింగాలను ఎవరైతే భక్తితో పూజిస్తారో, వారికి కైలాసం సిద్ధించి అందరి చేతా శివుని వలే పూజింపబడతారు, అని.
ఓం ఘృష్ణేశ్వరాయనమః, ఓం నమః శివాయ
శివాయ గురవే నమః
ఇప్పటి నుంచీ ప్రతిసారీ ఒక ప్రత్యేకమైన శివాలయం గురించి చెప్పుకుంటూ పోదాం. లెక్కవేస్తే అటువంటి మహిమాన్విత శివ క్షేత్రాలు చాలానే తేలాయి. ఇకనుంచీ ప్రతిసారీ ఒక్కో శివ క్షేత్రం గురించి చెప్పుకుందాం. ఆ వరుసలో ముందుగా ఆదిశంకరాచార్య జన్మ స్థానమైన కాలడితో ప్రారంభిద్దాం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి