మా పెద్దత్తయ్య
మా పెద్దత్తయ్య
భట్టిప్రోలు విజయలక్ష్మి
ఆవిడ పేరు పెద్దత్తయ్యే. అమ్మన్న అని కూడా అనేవాళ్ళు. పేరు కనకదుర్గ అనుకున్నా కానీ పూర్తి పేరు కనకదుర్గాంబ అని నాకు ఆవిడ పోయిన తరువాతే తెలిసింది. ఆవిడ ఎప్పుడు ఏ వేళలో చూసినా లక్ష్మీదేవిలా ఉండేది. ఆ కళ చాలా కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. ఆ లక్ష్మీకళ ఆవిడకు భగవద్దత్తం. ఆవిడకు తగ్గట్టు మామయ్యగారు చక్కగా నారాయణమూర్తి కళతో వుండేవారు. వారి వారి పేర్లు ఏమైనా వారు మాత్రం మొత్తం కుటుంబానికి లక్ష్మీ నారాయణులు. ఇద్దరికీ ఇద్దరే. ఆ ఇల్లు ఒక అన్నపూర్ణాలయం, సరస్వతీ నిలయం. ఎంతమంది అక్కడ ఉండి చదువుకున్నారో, ఎంతమంది ఆ ఇంట్లో ఆవిడ చేత్తో భోజనం చేశారో లెక్కే లేదు. ఎన్ని జననాలు, నిష్క్రమణాలు చూసారో పెద్దత్తయ్య, పెద్దమామయ్య గార్లు. బంధు మిత్రుల్లో ఎవరు హైదరాబాద్ వచ్చినా వారింట్లోనే బస. మా అమ్మానాన్నల పాస్ పోర్ట్ లలో పర్మనెంట్ అడ్రస్ కూడా ఆ ఇల్లే. అందరికీ కేరాఫ్ ఆ ఇల్లు. అత్తయ్యకి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లంటే మహా ప్రాణం. పెద్దక్కలా కాకుండా తల్లిలాగానే ఉండేది. అంతటి సహజమైన మాతృత్వం అందరికీ అబ్బదు. వాళ్లకు కడుపున పుట్టిన పిల్లలు లేరన్నమాటే గానీ, వాళ్ళెత్తుకోని పిల్లలూ లేరు. ముద్దు చేయని పిల్లలూ లేరు. ఎంతమందిని పెంచారో. ఎంతమందిని చదివించారో. ఆ రకంగా చూస్తే, వాళ్ళని పార్వతీ పరమేశ్వరులనాలి. ఎందుకంటే వాళ్ళు జగత్ పితరులు కదా.
చాలామంది ఆ భార్య మంచిది, భర్త మంచివాడు కాదు కోపిష్టి, లేదా, ఆ భర్త మంచివాడు, భార్య మంచిది కాదు గయ్యాళి అంటూ, అనుకుంటూ వుంటారు. ఆ సిద్ధాంతం నేను నమ్మను. ఎందుకంటే ఏ వ్యక్తి అయిన మంచిగా ఉండాలి అంటే వారి జీవిత భాగస్వామి కూడా వారికి సహకరించాలి. వాళ్ళ ఒక్కళ్ళ మంచితనం అన్ని సార్లూ సరిపోదు. జీవితభాగస్వామి చేయూతో, తల ఊపో తప్పనిసరిగా కావాలి. అప్పుడే వాళ్ళు తమ సహజ స్వభావమైన మంచితనాన్ని నలుగురికీ ఉపయోగపడేలా చేయగలరు. భార్య సహకారం లేనిదే భర్త, భర్త సహకారం లేని భార్య ఎవరికీ, ఎందుకూ ఉపయోగపడరు. ఎందరో దంపతులకు ఈ భార్యాభర్తలు ఆదర్శం. మామయ్యగారిని కోపిష్టి అనేవారు ఒక్కటి గ్రహించండి. ఆ కోపంలో ఒక బాధ్యత, ప్రేమ కూడా ఉండేవి. ఆయన లేనిదే అత్తయ్య అంతమందిని తల్లి లాగా చూడగలిగేదా. ఆలోచించండి. ఆ ఇల్లు ఎంతోమందికి ఇది మన ఇల్లు అనిపించ గలిగేలా ఆ దంపతులు ఉండేవారు. ఆ రోజుల్లో ఆ ఇల్లు ఒక ధార్మిక నిలయం లా ఉండేది. ఆ ఇంట్లో పూజ చూడనివారు, ప్రసాదం తిననివారు వుండరు.

మా అత్తగారు పోయిన మూడోరోజే పెద్దత్తయ్య పోయింది. పెద్దత్తయ్య అంటే నాకే కాదు, మా వారికి కూడా చాలా ఇష్టం, గౌరవం. ఆవిడిచ్చే కాఫీ అంటే ప్రాణం. అత్తయ్య కాఫీ తెచ్చేలోపల ఒక సువాసన అందరినీ కమ్మేసేది. దాంతో ముందే కాఫీ కోసం ఎదురుచూపులు స్టార్ట్ అయ్యేవి. నువ్వు ఎలా చేసినా మీ పెద్దత్తయ్య కాఫీ రుచి రావటం లేదని మా వారు గోల పెట్టేవారు. 'ఆవిడ కాఫీ గింజలు తెచ్చి అప్పటికప్పుడు వేయించి ఒక చేతితో తిప్పే మెకానికల్ గ్రైండర్ లో పొడి కొట్టి, ఫ్రెష్ గా డికాక్షన్ వేసి కాఫీ చేస్తుంది, అందుకే అంత ఫ్రెష్ రుచీ, వాసనా' అని నేను చెప్పగానే, మావారు వెంటనే బజారు కెళ్లి కాఫీ గింజలు తెచ్చిపోశారు. ఇక చూస్కోండి, మా ఇంట్లోనే కాదు, ఆ వీధిలోనే చక్కటి కాఫీ సువాసన. ఆ కాఫీ తాగుతూ, నేను, మా ఆయన రోజూ అత్తయ్యని తలుచుకునే వాళ్ళం. ఇవన్నీ చదివితే, మాఆయన మళ్లీ కాఫీ గింజలు తెస్తారో ఏమో. ఈ మధ్య ఇంకోటి కనిపెట్టారు లెండి. కాఫీ డే కి వెళ్లి దగ్గరుండి గ్రైండ్ చేయించి తెచ్చుకోవడం. అన్నట్టు మనలో మనకు ఒకమాట, ఎంత బాగా చేసినా పెద్దత్తయ్య కాఫీ రుచి రావటం లేదని సణుగుతూ ఉంటే, ఇలా ఉందా పని అని, ఆ కాఫీ చేసే పని మా ఆయనకె నేర్పి అప్పచెప్పా. చక్కగా ఇప్పుడు ఆయన కాఫీకి నేనే వంకలు పెట్టచ్చు. (దేవుడా, దేవుడా, ఇది మా ఆయన చదవకుండా చూడు. నీకు రేపు జీడిపప్పు నైవేద్యం పెడతా). ఇంతకీ ఆ రకంగా పెద్దత్తయ్య మా ఇంట్లో నిలిచిపోయింది.
ఇక మా మామయ్యగారు. ఆయనకీ ముక్కుమీదే కోపమని పేరు. నిజానికి ఆయనంటే ఉన్న భయం వల్లే, (అచ్చం మా నాన్న లాగానే) వాళ్ళింట్లో ఉంచిన పిల్లలు చదువుకునేవాళ్ళు. నాకు తెలిసి శ్రీధర్ బాబాయిని బామ్మ అందుకే పెద్దత్తయ్యా వాళ్ళింటికి పంపించింది. నాన్న అంటే బాబాయికి భయం కొద్దిగా తగ్గుతోందని అనుమానం రాంగానే బాబాయిని పెద్దమామయ్యగారికి అప్పచెప్పింది. వాళ్ళింట్లో ఉండి చదువుకున్న వాళ్ళల్లో, ఉద్యోగం చేసుకున్న వాళ్ళల్లో శ్రీధర్ బాబాయే కాకుండా, హృషీఅన్నయ్య, మాధవన్నయ్య, గిరిజ, నాగు, లలితానంద్, విశ్వం, శేషు, రాధిక కూడా వున్నారు. పెళ్లయ్యాక కూడా బాబాయ్, పిన్ని అక్కడే ఉండేవారు. వాళ్ళ ముగ్గురు పిల్లల్ని పెంచింది కూడా వీళ్ళే. వాళ్లనే కాదు సొంత మనవళ్ళనిద్దరినీ కూడా వీళ్ళే పెంచారు. నిజానికి బాబాయికి పెద్దత్తయ్య దగ్గరకు వచ్చాకే బాధ్యత పెరిగింది. పెద్దమామయ్యగారు డిసిప్లినేరియన్ అయితే, అత్తయ్య చాలా ప్రేమగా, మంచిగా ఉంటూనే, కచ్చితంగా కూడా ఉండేది. ఇల్లు శుభ్రంగా ఉంచేది. మామయ్యగారికి పూజకి అన్నీ సిద్ధంగా ఉంచేది. మామయ్యగారు చాలా సిస్టమాటిక్ గా చాలాసేపు పూజ చేసేవారు. వాళ్ళింట్లో శ్రీచక్రార్చన ఉండేది. మొదటిసారి దక్షిణావర్తశంఖం చూసింది కూడా వాళ్లింట్లోనే. మామయ్యగారు పూజ చేసుకుంటూ ఉంటే, అత్తయ్య, ఆ పక్కనే వంట చేసుకునేది. రోజూ బోల్డు రకాలు చేసేది. మామయ్యగారి పూజ అయ్యేసరికి అత్తయ్య వంట అయిపోయేది. అప్పుడు మహానైవేద్యంతో పూజ ముగిసేది. మడి కట్టుకుని వంట చేయటానికి వీలుగా వంట ఇంటి పక్కనే ఆనుకుని స్నానాలగది కట్టించారు. మడిబట్టలు ఆరేయటానికి మా ఇంట్లో లాగానే పైకి చూరుకి వేళ్ళాడుతూ రెండు వాసం దండేలు ఉండేవి. ఆ మడిబట్టలు తీసుకోవటానికి మరో పొడుగాటి వాసం బొంగు ఉండేది. ఇప్పుడు మేము ఆ బొంగుతో దొడ్లో జామకాయలు వగైరా కొట్టుకుంటున్నాం. ఆ దండలు మాత్రం అలానే వున్నాయి వాళ్ళ గుర్తుగా. అత్తయ్యా, మామ్మయ్యగారు ఇద్దరూ మడి కట్టుకుని పూజా, వంటా పూర్తి చేశాక అందరికీ తీర్థం, ప్రసాదం ఇచ్చేవారు మామయ్యగారు. అరటిపండు ప్రసాదం ఇచ్చిన రోజు మజ్జిగ అన్నంలో తినండే, అరటిపండు మజ్జిగతో తింటే మంచిది అని చెప్పేవారు.
మామయ్యగారు కోయంబత్తూర్ లో అగ్రికల్చరల్
బీ. ఎస్సీ. చదివారు. ఆయన గోల్డ్ మెడల్ తీసుకు వస్తే, ఆ రోజుల్లో చల్లపల్లి జమీందారుగారు మామయ్యగారిని గజారోహణం చేయించి వూళ్ళో ఊరేగించారుట. అది అందరూ చెప్పుకునేవాళ్ళు. ఉద్యోగరీత్యా చాలా ఊళ్ళు తిరిగి చివరికి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో అత్తయ్య సలహాపై మేడ మీద మరో వాటా కట్టించి అద్దెకిచ్చారు. రిటైర్ అయినాక కూడా జాబ్ చేశారు. ఆయన కోరిక, ప్రోత్సాహం మేరకే వాళ్ళబ్బాయి విఠల్ మెడిసిన్ చేసాడు. కోడల్ని కూడా డాక్టరునే తెచ్చుకున్నారు. మామయ్యగారే నాకు మొదట సుమారు 1976 లో 'గీతామకరందం' పుస్తకం చదువుకోమని ఇచ్చారు. ఆ మకరందం మాధుర్యం తెలిసాక నేను నాకూ ఒక కాపీ కొనుక్కున్నాను. ఆ తరువాత ఎంతమందికి గీతామకరందాన్ని గిఫ్ట్ గా ఇచ్చానో నాకే లెక్క లేదు. మొదటిసారి అది చదివినప్పుడు ఆ శ్లోకాలపై నోట్స్ రాసుకునేదాన్ని. తరువాత ఎందుకో ఆ నోట్స్(డైరీ) మా తమ్ముడికిచ్చాను.
వాళ్ళింట్లో మా పిల్లలకి ఇంకో ఆకర్షణ ఉండేది. అది వెనుక వాళ్ళింట్లో ఉన్న బాదం చెట్టు. ఉన్నది వెనక వాళ్ళింట్లోనే కానీ, కొమ్మలు మాత్రం ఈ ఇంట్లోనే ఉండేవి. వాటికి బోల్డు బాదం కాయలు. మేము అక్కడ ఉన్న రోజుల్లో రోజూ పైకి వెళ్ళి బాదంకాయలు కోసుకుని, కొట్టుకుని ఆ బాదంపప్పులు తినేవాళ్ళం. అది ఒక నిత్య కాలక్షేపం అక్కడ ఆరోజుల్లో. ఇప్పుడు అక్కడ ఆ బాదంచెట్టు లేదు. అత్తయ్య ఇంట్లో పెరటిలో జామ, కరివేపాకు, నిమ్మ, మందార చెట్లేసింది. ఆ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. కోడలు ఉష వచ్చాక ఫిగ్ కూడా పెంచింది. ఇప్పటికీ ఆ చిన్న పెరట్లో తిరగటం అంటే నాకు ఇష్టం. ఉష వచ్చాక దేవుడి మందిరం వంట ఇంట్లోంచి భోజనాల గదిలోకి మారింది. పూజలు మాత్రం యధావిధిగా జరుగుతున్నాయి. ఉష వంట చేస్తూనే స్తోత్రాలు చదివేసుకుంటూ ఉంటుంది. పొద్దున్న ఏడింటికల్లా వంట, పూజ, నైవేద్యం పూర్తి చేసేసుకుని హాస్పిటల్ కి బయలుదేరి పోయేది. మహా చురుకు తత్వం. తనకి అసాధ్యమైనది ఏదీ లేదేమో అనిపిస్తూ ఉంటుంది. మాతో ఒక సొంత చెల్లెలి లాగ కలిసిపోయింది. బంధువులందరితో చాలా ఆప్యాయంగా ఉంటుంది. బాధ్యతగా ఉంటుంది.

విఠల్ పేరు సాయివిఠల్. పెద్దత్తయ్య, మామయ్యగారు దత్తు తీసుకున్న అబ్బాయి. మా సరోజినీ అత్తయ్య పెద్ద కొడుకు. అత్తయ్యలందరూ సాయి భక్తులు. మగపిల్లలందరికీ పేరులో సాయి కలిపారు. విఠల్ కి చదువంటే పిచ్చి. నిజంగానే పిచ్చి. చదువుకోవడమన్నా, చదువుకున్న వారన్నా మహా ఇష్టం. మెడిసిన్ లో 3 విభాగాల్లో స్పెషలైజ్ చేసినా తృప్తిగా ఉండడు. ఇంకో ఏదో చదువుకోవాలన్న తపనలో ఉంటాడు. మంచి హస్తవాసి ఉన్న డాక్టర్. ఎన్ని చదివినా, ఎంత చదివినా రిటైర్ అయ్యాక కూడా చదువు కంటిన్యూ చేసి, కార్డియాలజీ లో స్పెషలైజేషన్ చేసాడు. సైన్స్ అంటే ఉన్న నమ్మకం దేవుడంటే లేదు. పూర్తిగా నాస్తికుడా అంటే అదీ కాదు. మళ్ళీ ఒక ఫ్రెండ్ చాలా క్రిటికల్ గా సిక్ అయితే ఆయన కోసం మొక్కుకుని ద్వారకా తిరుమల వెళ్లి వచ్చాడు. ఏవిషయం మాట్లాడినా, దాన్ని బాగా క్రిటికల్ గా అనలైజ్ చేస్తాడు, బట్టల నాణ్యత దగ్గర్నుంచి వాటి ధరల దాకా. అంతేనా ఏ పనిని ఎలా ఇంకా తక్కువ ఖర్చుతో చెయ్యచ్చా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏ టాపిక్ తీసుకున్నా వివరంగా మాట్లాడతాడు. విఠల్ కి షాపింగ్ అంటే ఇష్టం. వంటల్లో ప్రయోగాలు ఇష్టం. మైక్రోవేవ్ ఒకటి పెట్టుకుని దాంతో రకరకాల వంటలు చేస్తూ ఉంటాడు. పైగా ఇంటికి వచ్చిన మాలాంటి వాళ్ళందరికీ తినిపిస్తూ ఉంటాడు. వృత్తిలో యెంత బిజీగా ఉన్నా కూడా ఈ ప్రయోగాలు మాత్రం మానడు. బహుశా ఇది స్ట్రెస్ బస్టర్ అనుకుంటా. పిల్లలిద్దరూ కూడా USA వెళ్ళిపోయాక ఇద్దరూ ఇంకా బిజీ అయిపోయారు.
అన్నట్టు, ఇప్పటికీ ఆ ఇల్లు ఒక సత్రమే. ఒకప్పుడు అన్నపూర్ణానిలయం, సరస్వతీనిలయం అయితే, ఇప్పుడు అన్నపూర్ణగారు అలానే వున్నారు గానీ, సరస్వతి వలన ధన్వంతరి గారు కూడా వచ్చేసారు. దాంతో ఇప్పుడు ఆ ఇల్లు అన్నపూర్ణా నిలయం, సరస్వతీ నిలయం, ధన్వంతరీ నిలయం కూడా. మొత్తం ఇంత పెద్ద కుటుంబానికీ వీళ్ళే డాక్టర్లు. అందరూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టకపోయినా, వీళ్ళ సలహా మాత్రం నమ్మకంగా తీసుకుంటూ ఉంటారు. మేము మాత్రం వీళ్ళిద్దరినీ వదిలి పెట్టటం లేదు. వీళ్ల ప్రిస్క్రిప్షన్ లేనిదే మేము ఏమీ చేయము. అదీ సంగతి. ఇదీ మా పెద్దత్తయ్య కుటుంబంతో నా అనుబంధం .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి